Microsoft to Expand IDC | నోయిడా ఐడీసీ విస్తరణ: మైక్రోసాఫ్ట్.. ఎందుకంటే?!
Microsoft to Expand IDC | ఎన్సీఆర్ ఐడీసీని టెక్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు నోయిడా ఐడీసీని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది.

Microsoft to Expand IDC | టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా తన సేవలను మరింత విస్తృతం చేయనున్నది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో ఉన్న నొయిడాలోని సంస్థ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ)ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా ఐడీసీ సేవలు హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇటీవల నోయిడాకు విస్తరించింది. ఎన్సీఆర్ పరిధిలో టెక్నాలజీ రంగ సేవల పెరుగుదలకు గల అవకాశాలను గుర్తించిన మైక్రోసాఫ్ట్.. నొయిడాలోని కేపీ టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఐడీసీ సెంటర్‌ను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌పీరియెన్స్ అండ్ డివైజెస్ గ్రూప్, మైక్రోసాఫ్ట్ డిజిటల్ టీమ్స్, న్యూ గేమింగ్ డివిజన్ సేవలకు భారత్‌లో డిమాండ్ పెరుగుతున్నది. ఈ విభాగాల సేవలను విస్తరించడానికి 1.50 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఐడీసీ కేంద్రాన్ని విస్తరించనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్స్ట్యూషన్ల నుంచి టెక్ టాలెంట్‌ను ఆకర్షించడంతోపాటు ఎన్సీఆర్-ఐడీసీ కేంద్రాన్ని టెక్ హబ్‌గా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
రెడ్మాండ్ హెడ్‌క్వార్టర్స్ తర్వాత సంస్థకు చెందిన అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్లలో మైక్రోసాఫ్ట్ ఐడీసీ అతి పెద్దది. 1998లో హైదరాబాద్‌లో తొలి ఐడీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఉత్పత్తులను అభివృద్ధి చేసి, సేవలందించడానికి ఐడీసీని మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నది. హైదరాబాద్, బెంగళూరు, ఎన్‌సీఆర్‌ల్లో ఏర్పాటైన మైక్రోసాఫ్ట్ ఐడీసీ కేంద్రాలు మూడు టెక్నాలజీ గ్రూప్‌లు, కోర్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థలుగా ఆవిర్భవించాయి. నోయిడా ఇండియా డెవలప్మెంట్ సెంటర్ విస్తరణపై మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- idc
- micrtosoft india
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

