న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఇన్ఫర్మేటిక్స్.. రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఎనర్జీ స్టార్టప్‌ను ప్రారంభించింది కూడా. ఈ కొత్త వెంచర్‌తో దేశీయ సోలార్ ప్యానెల్ తయారీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నది.
అలాగే సుస్థిర ఇంధనాన్ని విసృత పరచడంతోపాటు ప్రతిష్ఠాత్మకమైన క్లీన్ ఎనర్జీ మిషన్‌కు మద్దతునిస్తున్నదని కంపెనీ ఎండీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రీయల్ కోసం అధిక సామర్థ్యం కలిగిన సౌర ఫలకాలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు, ఇందుకోసం ప్రత్యేక యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు ఆయన ప్రకటించారు.