MG Windsor EV | జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) భారత్ మార్కెట్లో తన పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు విండ్సార్ ఈవీ కారును ఆవిష్కరించింది. తాజాగా శనివారం వేరియంట్ల వారీగా ధరలు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ ట్రిమ్ ధర రూ.13.50 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమైంది. జడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీ తర్వాత భారత్ మార్కెట్లోకి వస్తున్న ఈవీ కారు.. విండ్సార్ ఈవీ. మూడు వేరియంట్లలో విండ్సార్ ఈవీ కారు వస్తోంది ఎక్సైట్ వేరియంట్ రూ.13.50 లక్షలు, ఎక్స్క్లూజివ్ వేరియంట్ రూ.14.50 లక్షలు, ఎసెన్స్ వేరియంట్ రూ.15.50 లక్షలు పలుకుతుంది. ఆకర్షణీయ ప్యాకేజీ, ధరలతో విండ్సార్ ఈవీ కారును అప్ గ్రేడ్ చేస్తారు. ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లే కస్టమర్లకు మరిన్ని ఇన్సెంటివ్ లు ఇస్తామని జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సతిందర్ సింగ్ బాజ్వా తెలిపారు. గ్రీన్ ఫ్యూచర్ దిశగా పరివర్తనకు అవకాశం కల్పిస్తామన్నారు.
ఎంజీ విండ్సార్ ఈవీ కారు పర్మినెంట్ సింక్రోనియస్ మటార్ విత్ 38కిలోవాట్ల లిథియం ఐరన్ ఫాస్పేట్ (ఎల్ఎఫ్పీ) బ్యాటరీతో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 136 పీఎస్ విద్యుత్, 200 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే 332 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఎకో+, ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్ల్లో లభిస్తుంది.
ఎయిరో గ్లైడ్ డిజైన్ తోపాటు ఎంజీ విండ్సార్ ఈవీ ఫ్యూచరిస్టిక్ లుక్ కలిగి ఉంటుంది. ఇల్యూమినేటెడ్ ఫ్రంట్ లోగో, ఎల్ఈడీ లైట్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎయిర్ లాంజ్ సీట్స్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ విత్ వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పీఎం 2.5 ఫిల్టర్, పవర్డ్ టెయిల్ గేట్, పనోరమిక్ సన్ రూఫ్, 135 డిగ్రీల రీక్లైన్ యాంగిల్ తోపాటు రేర్ సీట్లు 60:40 నిష్పత్తిలో ఉంటాయి.
80కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో విండ్సార్ ఈవీ కారుకు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. ఐస్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ అందజేస్తుంది. 36కి పైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో ఆపరేషన్ల కోసం డిజిటల్ బ్లూటూత్ కీ కలిగి ఉంటుంది. ఎంజీ-జియో ఇన్నోవేటివ్ కనెక్టివిటీ ప్లాట్ ఫామ్ (ఎంజీ-జియో ఐసీపీ) కల తొలి జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోడల్ కారు విండ్సార్ ఈవీ.
ఎంజీ విండ్సార్ ఈవీ కార్ల బుకింగ్స్ అక్టోబర్ మూడో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (బాస్) ఇన్సియేటివ్ కింద దీని ధర రూ.9.99 లక్షలు + రూ.3.5 ఫర్ కిలోమీటర్ బ్యాటరీ రెంటల్ ఉంటాయి. బ్యాటరీ మీద లైఫ్ టైం వారంటీతో వస్తున్న తొలి ఈవీ కారు విండ్సార్ ఈవీ. ఎంజీ యాప్ తో ఈ-హెచ్యూబీ ద్వారా విండ్సార్ ఈవీ కారును ఏడాది పాటు పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల వద్ద ఉచితంగా చార్జింగ్ చేసుకోవచ్చు. మూడేండ్ల తర్వాత లేదా 45 వేల కి.మీ దూరం ప్రయాణించిన తర్వాత విండ్సార్ ఈవీ విలువలో 60 శాతం తిరిగి కస్టమర్లు పొందొచ్చు.