న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఎంజీ మోటర్.. దేశీయ మార్కెట్లోకి మరో ఈవీని పరిచయం చేసింది. మూడు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 331 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
15.6 ఇంచుల టచ్‌స్క్రీన్, 8.8 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ చార్జింగ్, ఆటోమేటిక్ ఏసీ, ఆరు ఎయిర్‌బ్యాగ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది. 3.3 కిలోవాట్ల ఏసీ చార్జర్ 13.8 గంటల్లో బ్యాటరీ చార్జింగ్ కానుండగా, 7.4 కిలోవాట్ల బ్యాటరీ 6.5 గంటల్లో, 50 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్ కేవలం 55 నిమిషాల్లో పూర్తిగా రీచార్జికానున్నది. టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 400, టాటా పంచ్‌లకు పోటీగా ఈ మాడల్‌ను ప్రవేశపెట్టింది.