న్యూఢిల్లీ, మార్చి 30: ఎంజీ మోటర్ కూడా వాహన ధరలను పెంచేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఎంపిక చేసిన మాడళ్ల ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఉత్పత్తి వ్యయం అధికం కావడంతోపాటు కరెన్సీల్లో తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ధరల పెంపు నుంచి ప్రీమియం ఈవీ మాడైళ్లెన ఎంజీ ఎం9, సైబర్స్టార్లకు మినహాయింపునిచ్చింది.