Meta chief AI scientist : ఓపెన్ఏఐ ఎప్పుడైతే ఇంటరాక్టివ్ జనరేటివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిందో అప్పటినుంచి ఏఐ టెక్ పరిశ్రమలో హాట్ డిబేట్‌గా మారింది. మానవాళిపై ఏఐ ప్రభావం, లేటెస్ట్ టెక్నాలజీతో కొలువుల కోత నుంచి ఈ టెక్నాలజీ పని విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలపై టెక్ దిగ్గజాల నుంచి పరిశ్రమ నిపుణుల వరకూ చర్చ సాగిస్తున్నారు.
ఇక మరో ఐదేండ్లలో ఏఐ మానవ మేథస్సును అధిగమిస్తుందని ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ అంచనా వేశారు. వచ్చే ఏడాది నుంచే మానవుడి కంటే ఏఐ తెలివిగా వ్యవహరించడం ప్రారంభిస్తుందని మస్క్ ఇటీవల ట్వీట్ చేశారు. అయితే మస్క్ అభిప్రాయంతో మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్, ఏఐ వరల్డ్ గాడ్ఫాదర్స్లో ఒకరైన యాన్ లికున్ విభేదించారు. ఏఐ మానవుల కంటే తెలివిమీరబోదని అన్నారు.
లండన్‌లో జరిగిన ఓ ఈవెంట్ వేదికగా లికున్ మాట్లాడుతూ ప్రస్తుత ఏఐ సిస్టమ్స్ మనుషుల మాదిరి ఇంటెలిజెంట్ కాదని, సమీప భవిష్యత్‌లోనూ ఇవి మానవ మేథను అధిగమించలేవని స్పష్టం చేశారు. హేతుబద్ధత, ప్రణాళిక, జ్ఞాపకశక్తి, భౌతిక ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడం అనే నాలుగు మానవ మేథ కీలక స్వభావాలని లికున్ వివరించారు. ఈ విషయంలో ప్రస్తుత ఏఐ వ్యవస్ధలు మానవ మేథను అందుకోలేవన్నారు.
Read More :
Om Bheem Bush | ఓం భీమ్ బుష్‌ను థియేటర్లలో మిస్సయ్యారా.. మీ కోసమే ఈ అప్డేట్..!