Meta-Threads | ఎలన్‌మస్క్ సారధ్యంలోని ‘ఎక్స్ (ట్విట్టర్)’కు పోటీగా మార్క్ జుకర్‌బర్గ్ మెటా ఆవిష్కరించిన మైక్రో బ్లాగింగ్ సైట్ ‘థ్రెడ్స్’ వెబ్ వర్షన్ త్వరలో తీసుకు రానున్నది. వారం రోజుల్లోనే అందుబాటులోకి వస్తుందని ఇన్స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మస్సూరి చెప్పారు. అకౌంట్లకు నోటిఫికేషన్లు సెట్ చేయడంతోపాటు అవి క్రమంగా వచ్చేలా వెసులుబాటు కల్పిస్తున్నది. త్వరలో అకౌంట్లతో తమకు అవసరమైన పోస్ట్ సెర్చ్ ఆప్షన్ కూడా వస్తున్నది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకే అందుబాటులో ఉన్న థ్రెడ్స్.. త్వరలో వెబ్ వర్షన్లోనూ అందుబాటులోకి వస్తుంది.
మెటా ఆవిష్కరించిన `థ్రెడ్స్` ప్రారంభంలో అనూహ్యంగా నెటిజన్ల ఆదరణ సొంతం చేసుకున్నది. త్వరలో 10 కోట్ల డౌన్లోడ్లు సొంతం చేసుకున్నది. తర్వాతే అంతే యూజర్లకు దూరమైంది. ఒక దశలో ఐదు కోట్ల మంది యాక్టివ్ యూజర్లు కల థ్రెడ్స్.. ఇప్పుడు 1.30 కోట్ల యూజర్లకు పడిపోయింది. ఇప్పుడు వెబ్ వర్షన్ వచ్చిన తర్వాతైనా పుంజుకుంటుందా.. లేదా.. అన్నది చూడాలి.