Meta : సోషల్‌మీడియాలో కొందరు తప్పుడు పోస్టులు పెడుతుంటారు. దానివల్ల ఇతరులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకని హింస, అశ్లీలం, తప్పుడు వార్తలకు సంబంధించిన పోస్టులన మెటా కంపెనీ ఎప్పటికప్పుడు తొలగిస్తుంటుంది. కంపెనీ పాలసీ నిబంధనలకు విరుద్ధమైన పోస్టులను తీసేసేంది. అక్టోబర్ నెలలో భారతదేశవ్యాప్తంగా 3.2 కోట్ల ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్ల పోస్టులను తొలగించినట్టు మెటా ఒక ప్రకటనలో తెలిపింది. 13 పాలసీల కింద ఫేస్‌బుక్‌లోని 2.92 కోట్ల పోస్టులను తీసేసింది. 12 పాలసీల కింద 27 లక్షల తప్పుడు పోస్టులను ఇన్‌స్టాగ్రామ్‌లో తొలగించింది. అక్టోబర్ 1 నుంచి 31 తేదీ మధ్య భారత విజ్ఞాపణ వ్యవస్థ నుంచి 703 నివేదికలు వచ్చాయి. వరకు ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టింది.
‘మా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న పోస్టులు, ఫొటోలు, వీడియోలు, కామెంట్లను గమనించాం. అవి పోస్ట్ చేసినవాళ్లపై చర్యలు తీసుకుంటాం. అలాంటి పోస్టులను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి తొలగిస్తాం. ఇబ్బందికరంగా ఉండే ఫొటోలు, వీడియోలు యూజర్ల కంటపడకుండా వాటిమీద డేంజర్ అని మార్క్ చేస్తాం’ అని మెటా తెలిపింది.