న్యూఢిల్లీ : మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) మెసెంజర్‌కు సంబంధించి కీలక అప్డేట్ ప్రకటించారు. ఫేస్బుక్ మెసేజెస్, మెసెంజర్ కాల్స్‌కు ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్టెడ్ భద్రతను డిఫాల్ట్‌గా కల్పిస్తున్నట్టు వెల్లడించారు. యూజర్ల ప్రైవసీలో కీలక అడుగుగా ఈ చర్యను మెటా చేపట్టింది.
తన సిబ్లింగ్ యాప్ వాట్సాప్‌కు అనుగుణంగా మెసెంజర్‌లోనూ ప్రైవసీ దిశగా మేజర్ అప్డేట్ను జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ ప్రైవసీ ఆప్షన్‌తో మెటా లేదా థర్డ్ పార్టీ మెసేజ్‌ల కంటెంట్‌ను చూడటం కానీ, యాక్సెస్ చేయడం కానీ అసాధ్యం. 2016 నుంచి మెసెంజర్ యూజర్లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ను ఆప్ట్ చేసుకునే వెసులుబాటు మెటా కల్పించగా ప్రస్తుతం ఈ అప్డేట్తో అన్ని వ్యక్తగత కాల్స్, మెసేజ్‌లకు డిఫాల్ట్ సెట్టింగ్ వర్తిస్తుంది.
ఈ అరుదైన ఘనతను సాధించిన టీంను ఫేస్బుక్ పోస్ట్‌లో అభినందించిన జుకర్‌బర్గ్ గోప్యతకు కంపెనీ ఇచ్చే ప్రాధాన్యతను ప్రస్తావించారు. మెసెంజర్ రీబిల్డింగ్లో మెటా ప్రస్ధానాన్ని జుకర్‌బర్గ్ వివరించారు.
Read More :