Mercedes-Benz GLS facelift | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ (Mercedes-Benz) తన ప్రీమియం ఎస్యూవీ మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ (Mercedes-Benz GLS facelift) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు ట్రిమ్స్, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ కారు. మెర్సిడెజ్-బెంజ్ జీఎల్ఎస్ ఫేస్ లిఫ్ట్ ‘జీఎల్ఎస్ 450’ వేరియంట్ కారు ధర రూ.1.32 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలికితే, ‘జీఎల్ఎస్ 400 డీ’ వేరియంట్ రూ.1.37 కోట్లు పలుకుతుంది. వీటితోపాటు కంపెనీ రూ.85 వేల విలువైన సర్వీసింగ్ ప్యాకేజీ అందిస్తున్నది.
మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. త్వరలో డెలివరీ ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. పాత వర్షన్ కారుతో పోలిస్తే 2024 జీఎల్ఎస్ ధర రూ.4 లక్షల పై చిలుకు ఎక్కువ. బీఎండబ్ల్యూ ఎక్స్7, ఆడి క్యూ8, వోల్వో ఎక్స్‌సీ90, లాండ్ రోవర్ డిస్కవరీ మోడల్ కార్లతో మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్ లిఫ్ట్ పోటీ పడుతుంది. చాలా కాలం క్రితమే మార్కెట్ నుంచి ఉపసంహరించిన ‘జీఎల్ఎస్ 450’ వేరియంట్‌ను ఫేస్‌లిఫ్ట్ మోడల్‌గా తీసుకొస్తున్నది. అప్ డేటెడ్ జీఎల్ఎస్ మోడల్ కారులో హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంటుంది.
మాడ్యులర్ హై ఆర్కిటెక్చర్ (ఎంహెచ్ఏ) ప్లాట్‌ఫామ్‌పై జీఎస్ఎల్ ఫేస్‌లిఫ్ట్ కారును డెవలప్ చేసిందీ మెర్సిడెజ్ బెంజ్. గ్రిల్లెకు ఇరువైపులా న్యూ ఎల్ఈడీ ప్యాట్రన్ హెడ్ ల్యాంప్స్ తో వస్తున్న ఈ కారులో నాలుగు వెర్టికల్ సీట్లు జత చేశారు.
న్యూలీ డిజైన్డ్ టెయిల్ ల్యాంప్, ఫ్రంట్ బంఫర్పై హై గ్లాస్ బ్లాక్‌తో ఎయిర్ ఇంటెల్ గ్రిల్లే వస్తున్నది. న్యూ హారిజొంటల్ బ్లాక్ ప్యాట్రన్‌లో వస్తున్న టెయిల్ ల్యాంప్స్ కారుకు కొత్త లుక్ ఇస్తున్నాయి. హిమాలయ గ్రే కలర్లో 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ జత చేశారు.
పాత జీఎల్ఎస్ మోడల్ మాదిరిగానే లార్జ్లీ డాష్ బోర్డ్, 12.3 అంగుళాల సెంట్రల్లీ మౌంటెడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. క్లాసిక్, స్పోర్టీ, డిస్క్రీట్ మోడ్స్‌లో తాజా ఎంబీయూఎక్స్ వర్షన్‌తో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పని చేస్తుంది.
వీటితోపాటు కొత్తగా ‘ఆఫ్-రోడ్’ మోడ్ కూడా జత చేశారు. ఫ్రంట్ విజువల్ స్క్రీన్కు 360-డిగ్రీ కెమెరా, 5-జోన్ క్లైమేట్ కంట్రోల్, 13-స్పీకర్ బర్మెస్టర్, 3డీ సౌండ్ సిస్టమ్, అంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ టెయిల్ గేట్, పనోరమిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు జత చేశారు.
న్యూ జీఎల్ఎస్- జీఎల్ఎస్ 450 4మ్యాటిక్ వేరియంట్ 3.0 లీటర్ల 6-సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 375 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. జీఎల్ఎస్ 400డీ 4మ్యాటిక్ కారు 3.0 లీటర్ల 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్ (362 హెచ్‌పీ పవర్, 750 ఎన్ఎం టార్క్) కలిగి ఉంటది.
రెండు ఇంజిన్లూ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో ట్యూన్ చేశారు. మెర్సిడెజ్ 4మ్యాటిక్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఫోర్ వీల్స్‌కు పవర్ సప్లయ్ వుతుంది. ఈ రెండు ఇంజిన్లూ 48వాట్ల మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నాయి. ఈ టెక్నాలజీతో కారు అదనంగా 20 హెచ్‌పీ ఎక్స్ట్రా పవర్, 200 ఎన్ఎం టార్క్ పొందుతుంది. కేవలం 6.1 సెకన్లలో 100 కి.మీ వేగం అందుకునే ఈ కారు గరిష్టంగా గంటకు 250 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
సేఫ్టీ కోసం మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్ లిఫ్ట్ కారులో తొమ్మిది ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్లు, రేర్ వ్యూ కెమెరా, 360 డిగ్రీ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేక్ వ్యవస్థ కూడా జత చేశారు. జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారుతోపాటు ఈ ఏడాది తొమ్మిది కొత్త కార్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని మెర్సిడెజ్ బెంజ్ ఇంతకుముందు ప్రకటించింది.