న్యూఢిల్లీ, మే 21 : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్.. దేశీయ మార్కెట్క్కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. జీఎల్ఈ, జీఎల్ఎస్ నైట్ ఎడిషన్స్ విడుదల చేసిన ఈ కారు రూ.1.05 కోట్ల నుంచి రూ.1.43 కోట్ల లోపు లభించనున్నాయి. లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రవేశపెట్టిన ఈ కార్లను టెక్నాలజీ పరంగా అప్‌గ్రేడ్ చేసి ప్రవేశపెట్టింది.
వీటిలో నైట్ ఎడిషన్ జీఎల్ఎస్ 450 మాడల్ ధర రూ.1.41 కోట్లుగాను, నైట్ ఎడిషన్ జీఎల్ఎస్ 450 డీ మాడల్ ధర రూ.143 కోట్లు, నైట్ ఎడిషన్ జీఎల్ఈ 300డీ మాడల్ రూ.1.05 కోట్లు, నైట్ ఎడిషన్ జీఎల్ఈ 450 విలువ రూ.1.14 కోట్లుగా నిర్ణయించింది.