Mercedes-AMG SL 55 Roadster | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి ఓపెన్-టాప్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరించింది. సెవెన్త్ జనరేషన్ మెర్సిడెజ్-ఎఎంజీ ఎస్ఎల్ 55 రోడ్‌స్టర్ కారు ధర రూ.2.35 కోట్లు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కారు ఎస్ఎల్55 4.0-లీటర్ల బై-టర్బో వీ8 ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ 476 బీహెచ్పీ విద్యుత్ అభివృద్ధి చేస్తుంది.
మెర్సిడెజ్-ఎఎంజీ ఎస్ఎల్ 55 కారు తన స్వాభివిక లాంగ్ బాయ్నెట్, ఫ్రంట్ – ఇంజిన్డ్ బ్యాక్వర్డ్ డిజైన్‌తో రూపుదిద్దుకున్నది. పాత మోడల్ కారుతో పోలిస్తే ఎస్ఎల్55 మోడల్.. షార్ప్ ట్రయాంగులర్ హెడ్ ల్యాంప్స్, లార్జ్ పనరమెరికానా గ్రిల్లేతో మరింత దూకుడుగా దూసుకెళ్తుంది. ఎఎంజీ-స్పెక్ 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్యాబ్రిక్ రూప్, రీట్రాక్టబుల్, వైడ్ రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ తదితర ఫీచర్లతో రూపుదిద్దుకున్నది.
ఎస్ఎల్55 కారు 4.0- లీటర్ల బై-టర్బో వీ8 ఇంజిన్ వస్తుంది. ఇది 476 బీహెచ్పీ విద్యుత్, 700 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. మెర్సిడెజ్+ 4మ్యాటిక్ -ఏడబ్ల్యూడీ సిస్టమ్ ద్వారా ఆల్ ఫోర్ వీలర్స్‌కు శక్తినిచ్చే 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ కారు కేవలం 3.9 సెకన్లలో 100 కి.మీ వేగం అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 296 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.
ఎస్ఎల్55 కారు టాప్‌పై 4మ్యాటిక్ + ఎడబ్ల్యూడీ సిస్టమ్, రేర్ వీల్ స్టీరింగ్‌తో నడుస్తుంది. ఎఎంజీ రైడ్ కంట్రోల్ సస్పెన్షన్ విత్ అడాప్టివ్ అడ్జస్టబుల్ డాంపింగ్, 390 ఎంఎం డిస్క్ బ్రేక్స్ @ ఫ్రంట్, 360 ఎంఎం డిస్క్ బ్రేక్స్ @ రేర్ ఉంటాయి.
ఎఎంజీ ఎస్ఎల్55 కారు 11.9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లే ఉంటుంది. ఇది డ్రైవర్ వ్యూ యాంగిల్‌కు అనుకూలంగా డిజైన్ చేశారు. డ్రైవర్‌కు 12.3 అంగుళాల డిస్ప్లే అండ్ హెచ్యూడీ, ఎఎంజీ-స్పెసిఫిక్ గ్రాఫిక్స్, డేటా ప్రొజెక్షన్‌పై పట్టు ఉండేలా డిజైన్ చేశారు. ఎఎంజీ స్పోర్ట్ సీట్స్, ఎఎంజీ పెర్ఫార్మెన్స్ సీట్స్, బర్మెస్టర్ ఆడియో, ఎయిర్ స్క్రాఫ్ సిస్టమ్, ఎఎంజీ ట్రాక్ పేస్ తదితర ఫీచర్లు ఉన్నాయి.