హైదరాబాద్, నవంబర్ 6 : మీడియా, సోషల్, కన్జ్యూమర్ ఇంటిలిజెన్స్‌లో అంతర్జాతీయ దిగ్గజం మెల్ట్‌వాటర్..తాజాగా హైదరాబాద్ ఏఐ హబ్‌ను నెలకొల్పింది. 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో ఉద్యోగుల సంఖ్యను 60 నుంచి 150కి పెంచుకోనున్నట్టు ప్రకటించింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ఈ సెంటర్‌ను నెలకొల్పినట్టు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆదిత్యా జామి తెలిపారు.
ఈ హబ్ కోసం ఐఐటీ హైదరాబాద్, బిట్స్ పిలానీ హైదరాబాద్, ఐఐఐటీ హైదరాబాద్‌లకు చెందిన ప్రతిభ కలిగిన ఇంజినీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నట్టు, త్వరలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐఐటీ బెంగళూరు క్యాంపస్‌లకు చెందిన వారిని నియమించుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.