హైదరాబాద్, అక్టోబర్ 30 : తమిళనాడులో నేవేలి వద్దవున్న 250 మెగావాట్ల లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేసింది. అబుదాబి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ నిర్వహిస్తున్న విద్యుత్ ప్లాంట్లో వంద శాతం వాటాను హస్తగతం చేసుకున్నట్టు మెఘా గురువారం ప్రకటించింది.
ప్రస్తుతం ఇంధన రంగంలో 5.2 గిగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగివున్న మెయిల్..తమిళనాడు ప్లాంట్ కొనుగోలు ద్వారా ఈ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం కానున్నట్టు మెయిల్ గ్రూపు సీఎఫ్వో సలీల్ కుమార్ మిశ్రా తెలిపారు. నాణ్యత విద్యుత్ ఉత్పత్తి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో ఇదొక మైలురాయి వంటిదని పేర్కొన్నారు.