Reliance | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో 10-బ్లూచిప్ కంపెనీల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,03,532.08 కోట్లు హరించుకుపోయింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ మినహా అన్ని స్క్రీప్ట్లు భారీగా నష్టపోయాయి. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అత్యధికంగా కోల్పోయంది. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 491.90 (0.83 శాతం) నష్టపోయింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,474.79 కోట్లతో రూ.16,07,857.69 కోట్లకు పెరిగింది.
ఇక ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ అత్యధికంగా రూ. 44,037.2 కోట్లు నష్టపోయి రూ.13,67,021.43 కోట్లకు చేరింది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,772.72 కోట్లు పతనమై రూ.4,39,459.25 కోట్ల వద్ద స్థిరపడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.11,818.45 కోట్లు నష్టపోయి రూ.5,30,443.72 కోట్లకు పడిపోయింది. ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9,574.95 కోట్లు తగ్గి రూ.5,49,434.46 కోట్ల వద్ద నిలిచింది.
బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ. 8,987.52 కోట్లు నష్టపోయి రూ. 4,22,938.56 కోట్లకు చేరుకోగా, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.8,386.79 కోట్లు పతనమై రూ. 7,23,790.27 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,157.91 కోట్లు నష్టపోయి రూ 3,92,377.89 కోట్లకు.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 2,993.33 కోట్లు తగ్గి రూ. 8,41,929.20 కోట్లకు పడిపోయింది.
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.803.21 కోట్లు పతనమై రూ. 4,72,379.69 కోట్లకు తగ్గిపోయింది. రిలయన్స్ టాప్లో ఉండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.