Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల్లో టాప్ 10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.18 లక్షల కోట్లు పెరిగింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) భారీగా లబ్ధి పొందాయి. వీటితోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎం-క్యాప్ కూడా పెరిగింది. ఈ నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,18,598.29 కోట్లు పెరిగింది.
మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, హిందూస్థాన్ యూనీలివర్, ఐటీసీ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,06,631.39 కోట్లు పతనమైంది. గతవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ 490.14 పాయింట్లు (0.67 శాతం) నష్ట పోయింది.
ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.86,146.47 కోట్లు పెరిగి రూ.6,83,637.38 కోట్లకు చేరుకున్నది. సోమవారం ఎల్ఐసీ షేర్ దాదాపు ఆరు శాతం పెరిగి తొలిసారి షేర్ విలువ రూ.1000 మార్క్‌ను దాటింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.65,908.26 కోట్లు పెరిగి రూ.6,46,365.02 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.61,435.47 కోట్లు పెరిగి రూ.15,12,743.31 కోట్ల వద్ద స్థిర పడింది. మంగళవారం టీసీఎస్ షేర్ నాలుగు శాతం పెరగడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల మార్కును దాటేసింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.5,108.09 కోట్ల లబ్ధితో రూ.19,77,136.54 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,963.94 కోట్ల పతనంతో రూ.10,65,808.71 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.30,698.62 కోట్ల నష్టంతో రూ.5,18,632.02 కోట్లకు పడిపోయింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.16,132.15 కోట్లు నష్టపోయి రూ.6,31,044.50 కోట్ల వద్ద స్థిర పడింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,044.09 కోట్ల నష్టంతో రూ.6,92,980.35 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.9,779.06 కోట్లు కోల్పోయి రూ.7,09,254.77 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.7,013.53 కోట్లు నష్టంతో రూ.5,69,587.91 కోట్ల వద్ద ముగిసింది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీ ఎయిర్టెల్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ నిలిచాయి.