Reliance | గత వారం ముగిసిన ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థలు రూ.1,84,225.43 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) భారీగా పుంజుకున్నాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1457.38 పాయింట్లు (2.44 శాతం) వృద్ధితో ముగిసింది. టాప్-10 సంస్థల్లో హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మాత్రమే మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.48,238.78 కోట్లు వృద్ధి చెంది రూ.16,37,408.27 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,325.39 కోట్లు పెరిగి రూ. 5,15,887.19 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.23,472.25 కోట్ల లాభంతో రూ.6,40,949.71 కోట్లకు చేరుకున్నది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.21,003.35 కోట్ల లబ్ధితో రూ.5,28,377.17 కోట్ల వద్ద ముగిసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,886.94 కోట్లు పెరిగి రూ.11,76,750.92 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.8,874.22 కోట్లు లాభపడి రూ.4,45,509.68 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,447.1 కోట్లు పెరిగి రూ.5,19,662.10 కోట్ల వద్ద స్థిర పడింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,115.33 కోట్ల లబ్ధితో రూ.9,42,052.68 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.2,862.07 కోట్లు పెరిగి రూ.5,09,126.31 కోట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,244.22 కోట్ల పతనంతో రూ.5,76,683.68 కోట్లతో సరిపెట్టుకుంది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10లో రిలయన్స్ కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, ఇన్ఫోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.