Market Capitalisation | గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 స్క్రిప్ట్‌ల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,33,746.87 కోట్లు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొందాయి. గతవారం ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 989.81 పాయింట్లు వృద్ధి చెందింది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 32,071.59 కోట్లు లాభ పడి రూ.11,77,226.60 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.26,249.1 కోట్లు వృద్ధి చెంది రూ.17,37,717.68 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,804.5 కోట్ల లబ్ధితో రూ. 6,36,143.85 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 20,471.04 కోట్ల లాభంతో రూ.6,27,823.56 కోట్ల వద్ద నిలిచింది.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,171.84 కోట్లు పెరిగి రూ.4,93,932.64 కోట్లకు చేరింది. మరోవైపు, అదానీ ట్రాన్స్మిషన్ ఎం-క్యాప్ రూ.7,730.36 కోట్ల వృద్ధితో రూ.4,38,572.68 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,248.44 కోట్ల లబ్ధితో రూ.8,33,854.18 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,618.37 కోట్లు పెరిగి రూ.6,08,074.22 కోట్లతో ముగిసింది. హెచ్డీఎఫ్సీ ఎంక్యాప్ రూ.2,551.25 కోట్లు నష్టపోయి రూ.4,41,501.59 కోట్లతో సరిపెట్టుకుంది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.432.88 కోట్లు పతనమై రూ.4,34,913.12 కోట్లతో స్థిర పడింది. రిలయన్స అత్యధిక ఎం-క్యాప్ గల సంస్థగా నిలవగా, తర్వాతీ జాబితాలో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, అదానీ ట్రాన్స్మిషన్, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.