Maserati MC20 | ఇటలీ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ మాసెరాటి (Maserati).. భారత్ మార్కెట్లోకి మాసెరాటి ఎంసీ 20 కారు తీనుకొచ్చింది. అయితే, దీని ధర ఎంత అన్నది ప్రకటించలేదు. మాసెరాటి ఎంసీ 20 అంటే మాసెరాటి కోర్స్ 2020.. మిడ్ మౌంటెడ్ వీ6 ఇంజిన్‌ను మాసెరాటి ఇంజినీర్లు డెవలప్ చేశారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 630 హెచ్‌పీ విద్యుత్, 730 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. మూడు సెకన్లలోపు 100 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. గరిష్టంగా గంటకు 325 కి.మీ. ప్రయాణిస్తుంది.
‘భారత్ మార్కెట్లోకి తొలిసారి మాసెరాటి ఎంసీ20 అందుబాటులోకి తెచ్చినందుకు మేం గర్విస్తున్నాం. ఎంసీ20 ని దేశీయ మార్కెట్లోకి తేవడం లగ్జరీ, ఆటోమోటివ్ ఎక్స్‌లెన్స్‌కు ప్రశంసలే’ అని మాసెరటి ఆస్ట్రేలియా-ఏషియన్-ఇండియా జనరల్ మేనేజర్ బోజన్ జంకులోవిస్కీ చెప్పారు.
‘భారత్‌లో కార్ల ప్రియుల మనస్సులు చూరగొనడమే లక్ష్యంగా దేశీయ మార్కెట్లోకి మాసెరటీ ఎంసీ20 వస్తున్నది. రోజురోజుకు పెరుగుతున్న మార్కెట్లో కస్టమర్ల ఆకాంక్షలను మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిజైన్, స్టైల్, పనితీరు వంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి` అని చెప్పారు.భారత్‌లో తాజా మోడల్ కార్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు అసాధారణ స్థాయిలో కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తున్నది.