Maruti update Dzire Tour S | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన డిజైర్ టూర్ ఎస్ కారును అప్డేట్ చేసింది. 32 కిలోమీటర్ల మైలేజీతోపాటు ఏబీఎస్-ఈబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లతో తీసుకొచ్చింది. కమర్షియల్ సెడాన్ సెగ్మెంట్లో అత్యంత పాపులర్ కారు డిజైర్ అప్డేటెడ్ వర్షన్ కం ఆల్-న్యూ టూర్ ఎస్కే ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. న్యూ జనరేషన్ స్విఫ్ట్ డిజైర్ ఆధారంగా ఇది రూపు దిద్దుకున్నది. దేశంలోని ట్యాక్సీల్లో అత్యంత ఆదరణ పొందిన కారుగా మారుతి డిజైర్ టూర్ ఎస్ నిలిచింది. ఎల్ఈడీ హెడ్ ల్యాప్స్, న్యూ టూర్ ఎస్పై టూర్ ఎస్ బ్యాడ్జింగ్ సిగ్నేచర్ కలిగి ఉంటుంది. న్యూ స్విఫ్ట్ డిజైర్ కారుతో పోలిస్తే స్పోర్ట్స్ ప్రీమియం లుక్‌తో ఆకర్షణీయంగా ఉంది.