ముంబై, జనవరి 2: గత నెలకుగాను 1,24,722 యూనిట్ల కార్లను మాత్రమే ఉత్పత్తి చేసినట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ప్రొడ్యుస్ చేసిన 1,52,029 యూనిట్లతో పోలిస్తే 17.96 శాతం తగ్గినట్లు సంస్థ పేర్కొంది. మినీ, కాంప్యాక్ట్, ఎస్యూవీ విభాగాల్లో ఉత్పత్తి భారీగా తగ్గింది.