కొత్త కార్లపై మారుతి డిస్కౌంట్ల వర్షం!

న్యూఢిల్లీ: దేశంలోనే అగ్రశ్రేణి కార్ల తయారీ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతంలో కొత్త కార్ల కొనుగోలుదార్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 31 వరకు కార్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది. ఎర్టిగా మినహా ఎంట్రీ లెవల్ ఆల్టో నుంచి విటారా బ్రెజా వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ ఆఫర్ల ద్వారా తమ కార్ల విక్రయాలు పెంచుకోవడమే తమ లక్ష్యం అని మారుతి సుజుకి తెలిపింది. అయితే, ఈ డిస్కౌంట్లు ఒక్కో నగరానికి ఒకలా ఉంటాయని పేర్కొన్నది. కార్ల కొనుగోలు దారులు కంపెనీ అందించే ఆఫర్లను తెలుసుకోవాలని సూచించింది.
మారుతి ఎస్-ప్రెస్సో: క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు ప్లస్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలతో కలిపి మొత్తం డిస్కౌంట్ రూ.52 వేలు అందుబాటులో ఉంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యంతోపాటు 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ఆప్షన్ వేరియంట్ కారుపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.
మారుతి సెలేరియో: క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు ప్లస్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలతో కలిపి మొత్తం డిస్కౌంట్ రూ.47 వేలు అందుబాటులో ఉంది. 1.0 లీటర్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యంతోపాటుమాన్యువల్, ఏఎంటీ గేర్ ఆప్షన్ వేరియంట్ కారుపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎస్-ప్రెస్సో సీఎన్జీ ఆప్షన్ వేరియంట్‌పై ఈ ఆఫర్ లభిస్తుంది.
మారుతి ఆల్టో: ఎంట్రీ లెవల్ మోడల్ ఆల్టో కారు కొనుగోలు దారులకు గరిష్ఠంగా రూ.42 వేల డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్ డిస్కౌంట్ రూ.15 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేల మేరకు అందుబాటులో ఉంది.
మారుతి స్విఫ్ట్: ఈ మోడల్ కారు కొనుగోలు దారులకు క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు ఇస్తుండగా, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.20 వేలు లభిస్తుంది.
మారుతి ఎకో: ఈ మోడల్ కారు కొనుగోలు దారులకు క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు ఇస్తుండగా, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.20 వేలతో కలిపి మొత్తం రూ.37 వేల రాయితీ అందుబాటులో ఉంది.
విటారా బ్రెజా: క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు ఇస్తుండగా, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.20 వేలతో కలిపి మొత్తం రూ.35 వేలు ఆదా చేయొచ్చు. ఈ మోడల్ కారును దేశంలోకెల్లా అత్యంత పెట్రోల్ ఆదా కారుగా పరిగణిస్తున్నారు.
మారుతి డిజైర్: క్యాష్ డిస్కౌంట్ రూ.8,000, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.20 వేలతో కలిపి మొత్తం రూ.35 వేలు ఆదా చేయొచ్చు. దీన్ని కూడా అత్యంత పెట్రోల్ ఆదా మోడల్ కారుగా భావిస్తున్నారు.
మారుతి వ్యాగన్ ఆర్: క్యాష్ డిస్కౌంట్ రూ.8,000, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.15 వేలతో కలిపి మొత్తం రూ.30 వేలు పొదుపు చేయొచ్చు. దీన్ని కూడా అత్యంత పెట్రోల్ ఆదా మోడల్ కారుగా భావిస్తున్నారు.
మారుతి బాలెనో: అన్ని రకాల బాలెనో మోడల్ కార్లపై డిస్కౌంట్లు లభిస్తాయి. క్యాష్ డిస్కౌంట్ రూ.15,000, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4000 లభిస్తుంది. ఇక సిగ్మా వేరియంట్‌పై అదనంగా క్యాష్ డిస్కౌంట్ రూ.5000 లభిస్తుంది.
మారుతి సియాజ్: ఈ మోడల్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.10వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

