Maruti Suzuki | మారుతి సుజుకి డిస్కౌంట్ల వర్షం.. రూ.87 వేల వరకూ బెనిఫిట్లు.. ఇవీ డిటైల్స్..!
Maruti Suzuki | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన సెలెక్టెడ్ కార్లపై గరిష్టంగా రూ.87 వేల వరకూ రాయితీలు అందిస్తున్నది.
Maruti Suzuki | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన సెలెక్టెడ్ కార్లపై గరిష్టంగా రూ.87 వేల వరకూ రాయితీలు అందిస్తున్నది. గ్రాండ్ విటారా మొదలు ఇగ్నీస్, బాలెనో, సియాజో, జిమ్నీ, ఎక్స్ఎల్6 మోడల్ కార్లపై ఈ నెలాఖరు వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.
గ్రాండ్ విటారాపై రూ.87 వేల డిస్కౌంట్
మారుతి సుజుకి గ్రాండ్ విటారా కొనుగోలు చేసిన వారికి రూ.30 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.50 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ.7,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ చేసింది. అయితే సీఎన్జీ వేరియంట్ మీద ఎటువంటి ఆఫర్ ఇవ్వడం లేదని తెలిపింది.
బాలెనోపై రూ.57 వేల వరకూ బెనిఫిట్లు
మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారుపై గరిష్టంగా రూ.57 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది. క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.7,000 ఆఫర్ చేసింది. సీఎన్జీ వేరియంట్ మీద రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల ఎక్స్చేంజ్ బోనస్ కలుపుకుని మొత్తం రూ.25 వేల డిస్కౌంట్ అందిస్తున్నది.
ఇగ్నీస్పై రూ.62 వేల బెనిఫిట్స్
మారుతి సుజుకి ఇగ్నీస్ కారుపై గరిష్టంగా రూ.62 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. క్యాష్ డిస్కౌంట్ రూ.40 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.7,000 లభిస్తుంది. బాలెనో బేస్డ్ క్రాస్ ఓవర్ ఫ్రాంక్స్ మీద రూ.27 వేలు, ఎక్స్ఎల్6 ఎంపీవీపై రూ.20 వేల రాయితీ అందిస్తున్నది.
సియాజ్పై రూ.60 వేల డిస్కౌంట్
మిడ్ సైజ్ సెడాన్ కారు సియాజ్ మీద గరిష్టంగా రూ.60 వేల వరకూ బెనిఫిట్లు ఆఫర్ చేసింది. ఇందులో రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేలు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ రూ.10 వేలు రాయితీ లభిస్తుంది. ఇక జిమ్నీ కారుపై రూ.53 వేల డిస్కౌంట్ ప్రకటించింది. అందులో రూ.50 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.3000 కార్పొరేట్ ఆఫర్ అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

