Grand Vitara Recall | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి గ్రాండ్ విటారా కార్లను వెనక్కి పిలిచింది. గతేడాది డిసెంబర్ 9 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 29 మధ్య తయారైన గ్రాండ్ విటారా మోడల్స్‌ను రీకాల్ చేసింది. ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ పని చేయకపోవడం వంటివి గుర్తించామని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్స్ సహాయంతో సహాయంతో ట్యాంక్‌లో ఎంత ఇంధనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సరిగా పని చేయకపోవడంతో డ్రైవర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చే ఆస్కారం ఉంటుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమస్య నేపథ్యంలో 39,506 యూనిట్లను రీకాల్ జాబితాలో చేర్చించింది. ఆయా కార్ల యజమానులను సంప్రదిస్తామని మారుతి సుజుకి తెలిపింది. కార్ తనిఖీ కోసం అధీకృత సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని కంపెనీ పేర్కొంది. స్పీడోమీటర్ అసెంబ్లీలో లోపం గుర్తిస్తే.. వెహికిల్ వారంటీ గడువు ముగిసినా కంపెనీ ఆ భాగాన్ని ఉచితంగానే రీప్లేస్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ముందు జాగ్రత్త చర్యగా రీకాల్ చేస్తున్నామని.. సురక్షితమైన డ్రైవింగ్‌ను నిర్ధారించేందుకు వినియోగదారులు వెంటనే స్పందించాలని సూచించింది. ఇదిలా ఉండగా.. గ్రాండ్ విటారా ఎక్స్‌షోరూం ధర రూ.10.77లక్షల నుంచి రూ.19.72లక్షల వరకు ఉంటుంది. ఇది ప్రీమియం ఎస్యూవీ. గ్రాండ్ విటారా ఎస్యూవీ రెండు ఇంజిన్ ఆప్షన్ అందుబాటులో ఉన్నది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 101.5 బీహెచ్పీ, 137 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. కొన్ని వేరియంట్లలో ఆల్‌గ్రిప్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ సైతం ఉంది. 1.5-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్.. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో పెట్రోల్ ఇంజిన్ 90 బీహెచ్పీ, 122 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ మోటార్ 79 బీహెచ్పీ, 141 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ ఇంజిన్ ఎస్యూవీ గరిష్టంగా 27.11 కిలోమీటర్లు వస్తుంది. పెట్రోల్ మాన్యువల్ 21.11 కిలోమీటర్లు, పెట్రోల్ ఆటోమేటిక్ 20.58, ఆల్ గ్రిప్ ఏడబ్ల్యూడీ వేరింట్ 19.20 కిలోమీటర్లు వస్తుంది.