Maruti Suzuki | మారుతి నుంచి త్వరలో 7-సీటర్ ఎస్యూవీ.. టాటా సఫారీ.. మహీంద్రా ఎక్స్‌యూవీ
Maruti Suzuki | టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్ కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకి ఏడు సీటర్ల ప్రీమియం ఎస్యూవీ ‘గ్రాండ్ విటారా’ను త్వరలో మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
Maruti Suzuki | కస్టమర్ల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా కార్ల తయారీలో ముందు ఉంటుందీ మారుతి సుజుకి. అందుకే మారుతి సుజుకి కార్లంటే అందరికీ క్రేజ్.. మారుతున్న పరిస్థితులు.. ఇతర కార్ల తయారీ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది మారుతి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎస్‌యూవీలు, ప్రీమియం ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మారుతి సుజుకి ఏడు సీటర్ల ప్రీమియం ఎస్యూవీ ‘గ్రాండ్ విటారా’ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్ కార్లకు మారుతి సుజుకి ఏడు సీటర్ల ప్రీమియం ఎస్యూవీ ‘గ్రాండ్ విటారా’.. గట్టి పోటీ ఇవ్వనున్నదని తెలుస్తున్నది. ఇప్పటికైతే.. 7-సీటర్ గ్రాండ్ విటారా ఫీచర్లేమిటన్నది వెల్లడించకున్నా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) వంటి సేఫ్టీ ఫీచర్లతో వస్తుందని మీడియా కథనాలు వస్తున్నాయి. గ్రాండ్ విటారా, ఇన్విక్టో మోడల్ కార్ల మధ్యలో ఈ 7-సీటర్ గ్రాండ్ విటారా ఉంటుందని భావిస్తున్నారు. దీని ధర రూ.15 లక్షల నుంచి ప్రారంభం కావచ్చునని తెలుస్తున్నది. గ్లోబల్ సీ- ప్లాట్‌ఫామ్‌పై ‘7-సీటర్ గ్రాండ్ విటారా’ కారు డెవలప్ అవుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్రాండ్ విటారాను పోలినట్లు ఉన్నా.. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, న్యూ గ్రిల్లెతో ఫ్రంట్ డిజైన్ ఉంటుందని భావిస్తున్నారు. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తో న్యూ అల్లాయ్ వీల్స్ కనెక్ట్ అవుతాయని చెబుతున్నారు.
7-సీటర్ గ్రాండ్ విటారాలోనూ ప్రస్తుత గ్రాండ్ విటారా మోడల్ కారులో వాడుతున్న ఇంజిన్నే వాడతారని తెలుస్తున్నది. మైల్డ్ హైబ్రీడ్ సెటప్తోపాటు 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని సమాచారం. ఈ ఇంజిన్ గరిష్టంగా 115 బీహెచ్పీ విద్యుత్ 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. నాన్ -హైబ్రీడ్ ఇంజిన్ కూడా ఇస్తారని తెలుస్తున్నది. మాన్యువల్ లేదా సీవీటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కూడా ఉంటుంది.
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, లార్జ్ సన్‌రూఫ్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎంస్, సెకండ్ రోలో కెప్టెన్ సీట్స్ ఉంటాయి. మారుతి ఇన్విక్టో లో మాదిరిగా 7-సీటర్ గ్రాండ్ విటారా కారులో 6- ఎయిర్ బ్యాగ్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకర్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్లు, 360 డిగ్రీ కెమెరా వ్యూ, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (వీఎస్సీ) తదితర ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

