Maruti Suzuki Dzire | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki Dzire) తన పాపులర్ మోడల్ సెడాన్ (Sedan) కారు డిజైర్ (Dzire) అప్ డేటెడ్ వర్షన్ వచ్చేనెల 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ మోడల్ డిజైర్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,64,517 కార్లు అమ్ముడయ్యాయి. హోండా అమేజ్, హ్యుండాయ్ ఔరా, టాటా టైగోర్ వంటి కార్లకు మారుతి సుజుకి డిజైర్ గట్టి పోటీ ఇస్తుంది.
నూతన అవతార్‌లో వస్తున్న డిజైర్ (Dzire) పలు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అప్డేట్స్ కలిగి ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తోపాటు న్యూ గ్రిల్లె, రేర్ లో న్యూ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఫ్రెష్ అల్లాయ్ వీల్స్ సెట్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంటాయి. న్యూ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జర్, 360 డిగ్రీ కెమెరా సెటప్ తదితర ఫీచర్లు ఉంటాయి.
పాత మోడల్ మారుతి డిజైర్ కారు పాపులర్ 1.2 లీటర్ల కే సిరీస్ డ్యుయల్ – జెట్ డ్యుయల్-వీవీటీ పెట్రోల్ ఇంజిన్ (89.7 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్) తో వస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ తోపాటు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో వస్తున్న సీఎన్జీ వేరియంట్ (77.4 పీఎస్ విద్యుత్, 98.5 ఎన్ఎం టార్క్) కెపాసిటీ కలిగి ఉంటుంది.
2024 డిజైర్ కారు పాత డిజైర్ కే సిరీస్ ఇంజిన్ లేదా సుజుకి 2024 న్యూ జడ్ సిరీస్ 1.2 లీటర్ల 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో గానీ వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 82 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. పాత డిజైర్ కారు ధర రూ.6.56 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.9.39 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతాయి.