Maruti New Ertiga | దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి శుక్రవారం కొత్త తరం మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగను ఆవిష్కరించారు. ఎక్స్‌షోరూమ్‌లో దాని ధర రూ.8.35 లక్షల నుంచి రూ.12.79 లక్షల మధ్య పలుకుతుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ మోడ్‌లో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో దీన్ని ఆవిష్కరించారు. సీఎన్జీ ట్రిమ్స్ ఎర్టిగాను ఆవిష్కరించారు. ప్యాడిల్ షిప్టర్లతో అత్యాధునిక 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ హైబ్రీడ్ టెక్నాలజీతో నూతన తరం ఎర్టిగను రూపుదిద్దారు.
10 ఏండ్ల క్రితం ఎర్టిగను ఆవిష్కరించాం. భారత ఆటోమొబైల్ రంగంలో ఎర్టిగ గణనీయ పాత్ర పోషింఇంది. ఇది కొత్త సెగ్మెంట్‌ను క్రియేట్ చేసింది అని మారుతి సుజుకి ఇండియా ఎండీ కం సీఈవో హిషాషి తాకైచి చెప్పారు. తదుపరి తరం ఎర్టిగలో నూతన ఇంజిన్, ఆల్-న్యూ ట్రాన్స్మిషన్, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయన్నారు.
వినియోగదారులకు ఇంధన ఆదాతోపాటు టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతోపాటు సౌకర్యవంతమైన బ్రాండ్ విజన్ మారుతిసుజుకి కలిగి ఉంది. తదుపరి తరం ఎర్టిగను భవిష్యత్‌లో భారత్ ఎంపీవీ (మల్టీ పర్పస్ వెహికల్)గా ఎర్టిగ నిలుస్తుందని హిషాషి తాకైచి తెలిపారు. తమ కస్టమర్లు నూతన తరం `ఎర్టిగ`ను ఆదరిస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు.
పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో ఎర్టిగ మోడల్ కారు లభ్యం కానున్నది.పెట్రోల్ వేరియంట్ కారుపై ఒక లీటర్ 20.51 కి.మీ, సీఎన్జీ వేరియంట్ కారు ఒక కిలో సీఎన్జీపై 26.11 కి.మీ మైలేజీ ఇస్తుంది. గత కొన్నేండ్లుగా మల్టీ పర్పస్ వెహికల్స్ సెగ్మెంట్లో వృద్ధి నమోదవుతున్నది మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.