Maruti Discounts | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి. కార్ల విక్రయాల్లోనూ ఆ సంస్థదే పై చేయి. రోజురోజుకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో హ్యుండాయ్, టాటా మోటార్స్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నది. ఎస్యూవీ, హ్యాచ్ బ్యాక్ తదితర కార్ల సెగ్మెంట్లలో తన స్థానం పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ తరుణంలోనే ఏప్రిల్లో కొన్ని మోడల్ కార్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నది. ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా డీలర్ల వద్ద డిస్కౌంట్లలో తేడాలు ఉంటాయి. ఆయా కార్లపై మారుతి అందిస్తున్న డిస్కౌంట్ల గురించి తెలుసుకుందామా..!

మారుతి సుజుకి ఇగ్నీస్ మోడల్ కారుపై గరిష్టంగా రూ.58 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. అందులో రూ.40 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేలు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది. ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ కార్లకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి.

మారుతి సుజుకి పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనోపై రూ.58 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ కార్లపై క్యాష్ డిస్కౌంట్ రూ.15 వేలకు పరిమితం చేశారు.

మారుతి సుజుకి సియాజ్ కారుపై ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 కలుపుకుని మొత్తం రూ.53 వేల డిస్కౌంట్ అందిస్తున్నది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రీడ్ కార్లపై రూ.58 వేలు, స్ట్రాంగ్ హైబ్రీడ్ వర్షన్లపై రూ.84 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ టర్బో పెట్రోల్ వేరియంట్ మీద రూ.68 వేల వరకూ ధర తగ్గింపు ఆఫర్ చేసింది. ఇతర పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై డిస్కౌంట్లు వేర్వేరుగా ఉంటాయి.

మారుతి సుజుకి జిమ్నీ కారుపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 2022-23, 2023-24 మోడల్ కార్లలో స్పెషిఫిక్ ట్రిమ్స్ మీద గణనీయ క్యాష్ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.