Maruti Suzuki Alto | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ ఆల్టో కార్ల సేల్స్‌లో సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. 2000లో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన ఆల్టో మోడల్ కారు 2004కల్లా దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. తాజాగా 45 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
2008లో తొలి పది లక్షలు, 2012లో 20 లక్షలకు, 2016లో 30 లక్షల యూనిట్లకు, 2020 ఆగస్టులో 40 లక్షల యూనిట్ల మార్క్ దాటేసింది. తాజాగా గురువారం 45 లక్షల యూనిట్లు విక్రయించిన మార్క్ ను అధిగమించింది.
మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ స్పందిస్తూ.. ‘మా కస్టమర్ల నుంచి తిరుగులేని విశ్వాసం, మద్దతు లభిస్తుందనడానికి నిదర్శనం’ అని ఓ ప్రకటనలో తెలిపారు.