Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. కిత్రం సెషన్తో పోలిస్తే బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లలో అమ్మకాలతో ఒత్తిడికి గురయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 82,101.86 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 82,300.44 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యల్పంగా 81,635.57 పాయింట్ల కనిష్ఠానికి పతనమైంది. చివరి సెషన్లో స్వల్పంగా కోలుకున్నాయి.
చివరకు 152.93 పాయింట్ల నష్టంతో 81,820.12 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 70.60 పాయింట్లు తగ్గి.. 25,057.35 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 1,967 షేర్లు పెరగ్గా.. 1,808 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ గెయినర్లు నిలిచాయి. బజాజ్ ఆటో, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ 1.5 శాతం, ఆటో దాదాపు ఒక శాతం, ఫార్మా 0.5 శాతం పతనమయ్యాయి. రియల్టీ ఇండెక్స్ 2శాతం, మీడియా ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒకశాతం వృద్ధిని నమోదు చేశాయి.