ఆ ముగ్గురు భారత్ చట్టాలను ఫేస్ చేయాల్సిందే!

న్యూఢిల్లీ: అవినీతి, మోసం, రుణాల ఎగవేతకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్య, నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీ తదితరులను త్వరలోనే దేశానికి తీసుకొస్తామని కేంద్రం గురువారం కుండబద్ధలు కొట్టింది. మోసాలకు పాల్పడినందుకు వారు భారత చట్టాలను ఎదుర్కోవాల్సిందేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

రాజ్యసభలో బీమా సవరణ బిల్లుపై జరిగిన చర్చకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్య ప్రస్తుతం బ్రిటన్‌లో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వారి అప్పగింత కోసం కేంద్రం బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నది.

ఇక నీరవ్ మోదీ మేనమామ మెహుల్ చౌక్సీ ప్రస్తుతం అంటిగ్వాలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆ దేశంతో భారత్‌కు నేరస్తుల అప్పగింత ఒప్పందం లేకున్నా.. భారత్‌లో అవినీతికి పాల్పడినందుకు భారత ప్రభుత్వం కోరితే అప్పగించేందుకు సిద్ధం అని అంటిగ్వా అధినేత ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మద్యం వ్యాపారి విజయ్ మాల్య.. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ నిర్వహణ కోసం వివిధ బ్యాంకుల నుంచి రూ.9000 కోట్ల పై చిలుకు రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలను చెల్లించకుండా 2016లో బ్రిటన్‌కు వెళ్లిపోయి, అక్కడే ఉన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించాయి.

దీంతో విజయ్ మాల్య ఆర్థిక నేరాలపై బ్రిటన్ న్యాయస్థానాలు విచారణ జరిపి ఆయనను దోషిగా తేల్చాయి. అయితే, బ్రిటన్‌లో విజయ్ మాల్య ఆశ్రయం కోరినట్లు వార్తలొచ్చాయి. విజయ్ మాల్య ఆర్థిక నేరాలకు పాల్పడినందున ఆయనను అప్పగించే విషయమై బ్రిటన్ హోంమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చౌక్సీ రూ.14,500 కోట్ల మేరకు మోసానికి పాల్పడ్డారు. ఈ కుంభకోణం వెలుగు చూసే సమయానికి వారిద్దరూ విదేశాలకు పారిపోయారు. తర్వాత నీరవ్ మోదీని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

