హైదరాబాద్, నవంబర్ 7: గృహాలాంకరణ ఉత్పత్తుల విక్రయ సంస్థ మైసన్ సియా..తాజాగా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి స్టోర్‌ను మంగళవారం ప్రారంభించింది. 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ అలంకరణానికి సంబంధించిన లగ్జరీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. యూరోపియన్‌లో ఉన్న అనుభూతిని పొందే విధంగా ఈ స్టోర్‌ను డిజైన్ చేసినట్టు కంపెనీ ఫౌండర్, సీఈవో వాటికా అగర్వాల్ తెలిపారు.