ముంబై, జూలై 6: ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ మహీంద్రా ట్రాక్టర్..దేశీయ మార్కెట్కు మరో ట్రాక్టర్ను పరిచయం చేసింది. యూవో టెక్+585 డీఐవీఐ పేరుతో విడుదల చేసిన ఈ ట్రాక్టర్ మల్టీపర్పస్గా వినియోగించుకోవచ్చునని తెలిపింది. ఈ నూతన ట్రాక్టర్లపై ఆరేండ్ల వ్యారెంటీ కల్పిస్తున్నది. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో ఏడు కొత్త ట్రాక్టర్లు, 12 నూతన ఫీచర్లతో వీటిని తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు.