Mahindra XUV300 | దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ ‘మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300)’ మరింత కాస్ట్ లీ అయ్యింది. ఇప్పుడు ఎక్స్‌యూవీ300 కారు ధర రూ.67,600 ఎక్కువైంది. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం బీఎస్-6 2.0 అమలు ప్రారంభమైన తర్వాత ఎక్స్‌యూవీ300 మోడల్ కారు ధర మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు గత నెలలో ఎక్స్‌యూవీ300 కారు ధర పెంచేయడం ఆసక్తికర పరిణామం.
గత నెల ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) కారు ధర రూ.22 వేలు పెరిగింది. తాజా పెంపుతో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారు ధర రూ.29 వేల నుంచి రూ.67,600 మధ్య పెరిగింది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 పెట్రోల్ వేరియంట్ కారు రూ.34,201, డీజిల్ వేరియంట్ కార్ల ధరలు రూ.30 వేల నుంచి రూ.67 వేల మధ్య పెరిగాయి.
తాజా ధర పెంపు తర్వాత మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) కారు రూ.8.41 లక్షల నుంచి మొదలవుతుంది. అయితే, డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8 (ఓ) ఏఎంటీ డ్యుయల్ టోన్ వేరియంట్ల ధరలు మాత్రం పెరగలేదు.
డబ్ల్యూ4- 1.2 పెట్రోల్: రూ.8,41,499
డబ్ల్యూ 6- 1.2 పెట్రోల్ : రూ.9,99,996
డబ్ల్యూ6 -1.2 పెట్రోల్ ఏఎంటీ: రూ.10,85,000
డబ్ల్యూ8- 1.2 పెట్రోల్ : రూ.11,45,999
డబ్ల్యూ8 (ఓ)- 1.2 పెట్రోల్: రూ.12,68,700
డబ్ల్యూ8 (ఓ) -1.2 పెట్రోల్ డ్యూయల్ టోన్: రూ.12,87,300
డబ్ల్యూ8 (ఓ)-1.2 పెట్రోల్ ఏఎంటీ: రూ.13,36,900
డబ్ల్యూ8 (ఓ)- 1.2 పెట్రోల్ ఏఎంటీ డ్యూయల్ టోన్: రూ.13,21,000
డబ్ల్యూ4-1.5 డీజిల్: రూ.9,90,300
డబ్ల్యూ6-1.5 డీజిల్: రూ.11,03,550
డబ్ల్యూ6-1.5 డీజిల్ ఏఎంటీ: రూ.12,35,400
డబ్ల్యూ8-1.5 డీజిల్: రూ.13,04,900
డబ్ల్యూ8 (ఓ)-1.5 డీజిల్: రూ.13,90,900
డబ్ల్యూ8 (ఓ)- 1.5 డీజిల్ డ్యూయల్ టోన్: రూ.14,05,900
డబ్ల్యూ8 (ఓ)-1.5 డీజిల్ ఏఎంటీ: రూ.14,59,599
మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) కారు రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ గల కారు 109 బీహెచ్పీ విద్యుత్, 200ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. మరో వేరియంట్ కారు 1.5-లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. డీజిల్ వేరియంట్ కారు ఇంజిన్ 115 బీహెచ్పీ విద్యుత్, 300 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.