ముంబై, జూలై 8: మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్వో పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.8.94 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.12.99 లక్షలు. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి.
1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌లో 10.24 ఇంచుల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆన్లైన్ నావిగేషన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, డ్యూయల్-టోన్ రూఫ్, స్మార్ట్ స్టీరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.