Mahindra | హైదరాబాద్, మార్చి 14: జనరేటర్ల సంస్థ మహీంద్రా పవరాల్ జెన్సెట్ సరికొత్త మాడల్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. రెకాన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ జనరేటర్ 625 కిలోవాట్లతో సరికొత్త సీపీసీబీఐవీ+ ఉద్గార మార్గదర్శకాలకు లోబడి తయారుచేసింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ వేణు వినోద్ మాట్లాడుతూ..తెలుగు రాష్ర్టాల్లో జనరేటర్లకు డిమాండ్ ఉంటుందన్న అంచనాతో ఈ నూతన శ్రేణిని విడుదల చేసినట్లు, దీంతో 625 కిలోవాట్ల వరకు జనరేటర్లను విడుదల చేసినట్లు అయిందన్నారు.
పాతవాటితో పోలిస్తే ఈ జనరేటర్ పనితీరు మెరుగ్గావుంటుందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో జనరేటర్ల ఉత్పత్తి ప్రారంభించినట్లు, ఈ నూతన సిరీస్ డీజిల్ జనరేటర్లు కూడా ఇక్కడే తయారు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తం వ్యాపారంలో తెలుగు రాష్ర్టాల వాటా అధికంగా ఉండటం వల్లనే ఇక్కడ యూనిట్‌ను నెలకొల్పినట్లు చెప్పారు.