Anand Mahindra | యూపీ బాలికకు ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే..!
Anand Mahindra | సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా తన అధికార ఎక్స్ ఖాతాలో మరో పోస్ట్ పెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలికకు ఆయన ఉద్యోగం ఆఫర్ చేశారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఇటీవల కోతుల దాడి నుంచి ఏడాది వయస్సున్న తన మేనకోడలును కాపాడుకున్న బాలికపై ప్రశంసలు కురిపించారు. ఆమె పెరిగి పెద్దదైన తర్వాత తాను ఉద్యోగం ఇస్తానని పేర్కొన్నారు.
Anand Mahindra : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా తన అధికార ఎక్స్ ఖాతాలో మరో పోస్ట్ పెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలికకు ఆయన ఉద్యోగం ఆఫర్ చేశారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఇటీవల కోతుల దాడి నుంచి ఏడాది వయస్సున్న తన మేనకోడలును కాపాడుకున్న బాలికపై ప్రశంసలు కురిపించారు. ఆమె పెరిగి పెద్దదైన తర్వాత తాను ఉద్యోగం ఇస్తానని పేర్కొన్నారు.
మనం సాంకేతికలో నిష్ణాతులుగా మారుతున్నామా.. లేదంటే దానికి బానిసలుగా మారుతున్నామా..? అనే సమాధానం లేని ప్రశ్న వినిపిస్తున్న వేళ ఆ బాలిక సాంకేతికతను సరిగ్గా వినియోగించి చూపించిందని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. ఆమె సమయ స్ఫూర్తి ఆసాధారణమని పేర్కొన్నారు. ఆమె చదువు పూర్తయిన తర్వాత కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటే.. మా కంపెనీలో చేరేలా ఆమెను మేం ఒప్పిస్తామని తెలిపారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లాలోని ఓ గ్రామంలో ఇంట్లోకి జొరబడిన కోతుల మూకను తరిమేందుకు పదమూడేళ్ల బాలిక మంచి ఎత్తుగడ వేసింది. దాంతో కోతులు తోక ముడిచుకుని పారిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆ ఊళ్లో పంకజ్ ఓఝా అనే పెద్దాయన ఇంటికి ఇటీవల బంధువులు వచ్చారు. తర్వాత వాళ్లు బయలుదేరడంతో వారిని సాగనంపేందుకు పంకజ్ కుటుంబసభ్యులు కూడా కిందకు వెళ్లారు. ఇంట్లో నికిత అనే 13 ఏండ్ల బాలిక, 15 నెలల వయస్సున్న ఆమె మేనకోడలు మాత్రమే ఉన్నారు.
పంకజ్ కుటుంబసభ్యులు కిందకు వెళ్లేటప్పుడు గేటు వేయకపోవడంతో ఒక కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించింది. అప్పుడు నికిత తన మేనకోడలితో ఆడుకుంటోంది. కోతులను చూడగానే ఆమెకు నోట మాటరాలేదు. అయితే కొన్ని క్షణాల్లోనే తేరుకుని సమయస్ఫూర్తిని ఉపయోగించింది. తమ ఇంట్లో ఉన్న అమెజాన్ వాయిస్ సర్వీస్ పరికరం ‘అలెక్సా’కు కుక్కలా మొరగమని ఆదేశాలు ఇచ్చింది. వెంటనే అది కుక్కలా శబ్దం చేసింది. దాంతో కుక్క ఉందనే కోతులు పారిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా బాలికకు జాబ్ ఆఫర్ చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

