Mahindra BE 6e-XEV 9e | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో రెండు ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లు బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ కార్ల ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26న బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ కార్లను ఆవిష్కరిస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్ మార్కెట్లోకి తీసుకొస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కం సీఈఓ రాజేష్ జెజురికర్ తెలిపారు. మహీంద్రా బీఈ 6ఈ కారు ‘బీఈ బ్రాండ్’ తొలి ఎలక్ట్రిక్ కారు కాగా, ఎక్స్ఈవీ బ్రాండ్ మొట్ట మొదటి కారు ‘ఎక్స్ఈవీ 9ఈ’ కానున్నాయి. ఎలక్ట్రిక్ ఆర్జిన్ ఇంగ్లో ఆర్కిటెక్చర్ ఆధారంగా బీఈ, ఎక్స్ఈవీ బ్రాండ్ కార్లు రూపుదిద్దుకుంటున్నాయి.
ఫోక్స్ వ్యాగన్ మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ మ్యాట్రిక్స్ (ఎంఈబీ), యూనిఫైడ్ సెల్స్ నుంచి ఎలక్ట్రిక్ కాంపోనెంట్లను మహీంద్రా ఇంగ్లో ఫ్లాట్ ఫామ్ వాడుకుంటున్నది. ఎంఈబీ ప్లాట్ ఫామ్, దాని కాంపొనెంట్స్ను ఫోక్స్ వ్యాగన్ బ్రాండ్స్ ఫోక్స్ వ్యాగన్, ఆడి, స్కోడా, సీట్/కుర్పాలతోపాటు ఫోర్డ్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు వినియోగిస్తున్నాయి. మహీంద్రాతో కలిసి స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా సహకారంతో ఫోక్స్ వ్యాగన్ గ్రూపు టెక్నాలజీ, దాని ప్లాట్ ఫామ్ బిజినెస్ నిర్వహిస్తున్నాయి.