Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలో టాప్-10లో తొమ్మిది సంస్థలు రూ.2,09,952.26 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. ఈక్విటీ మార్కెట్లు బేర్’ చూపులు చూడటంతో హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1,822.46 (2.24 శాతం) పాయింట్లు నష్టంతో ముగిసింది. టాప్-10 సంస్థల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మాత్రమే లబ్ధి పొందింది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44,195.81 కోట్లు కోల్పోయి రూ.5,93,870.94 కోట్లకు చేరుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.41,994.54 కోట్ల నష్టంతో రూ.17,96,726.60 కోట్ల వద్ద స్థిర పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.35,117.72 కోట్ల పతనంతో రూ.6,96,655.84 కోట్లకు చేరింది.
భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,108.72 కోట్ల నష్టంతో 9,47,598.89 కోట్ల వద్ద ముగిసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.23,137.67 కోట్లు కోల్పోయి రూ.14,68,183.73 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.19,797.24 కోట్ల నష్టంతో రూ.5,71,621.67 కోట్ల వద్ద స్థిర పడింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,629.49 కోట్లు కోల్పోయి రూ.7,69,496.61 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.5,690.96 కోట్ల నష్టంతో రూ.6,02,991.33 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.5,280.11 కోట్ల నష్టంతో రూ.8,84,911.27 కోట్ల వద్ద ముగిసింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.46,891. కోట్లు పెరిగి రూ.13,29,739.43 కోట్ల వద్ద స్థిర పడింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30 ఇండెక్స్ లో విలువైన టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్, ఎల్ఐసీ నిలిచాయి.