Reliance | గత వారం టాప్-10 కంపెనీల్లో ఏడు కార్పొరేట్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.2,28,367.09 కోట్లు జత కలిశాయి. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లబ్ధిపొందింది. రిలయన్స్తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లబ్ధి పొందాయి. మరోవైపు టీసీఎస్, హిందూస్థాన్ యూనీ లివర్, భారతీ ఎయిర్టెల్ నష్టపోయాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,35,204.46 కోట్లు పెరిగి రూ.16,62,776.63 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.5,125.39 కోట్లు పెరిగి రూ.8,43,528.19 కోట్ల వద్ద స్థిరపడింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,817.13 కోట్లు పెరిగి రూ.5,26,170.49 కోట్ల వద్ద నిలిచింది.
హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.7,050.11 కోట్లు పెరిగి రూ.5,08,612.95 కోట్లకు చేరుకున్నది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,993.93 కోట్లు పెరిగి మొత్తం దాని విలువ రూ.4,49,747.2 కోట్లకు చేరింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.19,187.91 కోట్లు ఎక్కువ రూ.4,41,500.53 కోట్ల వద్ద స్థిరపడింది.
ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,146.7 కోట్లు నష్టపోయి రూ.13,45,178.53 కోట్లకు చేరుకున్నది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.2,396 కోట్లు పతనమై రూ.5,48,136.15 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ రూ.4,256.32 కోట్లు కోల్పోయి మొత్తం ఎం-క్యాప్ రూ.3,90,263.46 కోట్ల వద్ద నిలిచింది.