Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల స్క్రిప్ట్‌లు భారీగా లాభ పడ్డాయి. ఆ సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,61,767.61 కోట్లు పెంచుకున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాండ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1914 పాయింట్లు (3.33%) లాభంతో ముగిసింది. టాప్-10 సంస్థల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.41,469.24 కోట్లు పెరిగి రూ. 8,35,324.84 కోట్లకు పెరిగింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.39,073.7 కోట్లు పెరిగి రూ.17,95,709.10 కోట్ల వద్ద స్థిర పడింది.
ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,687.09 కోట్లు పెంచుకుని రూ.4,88,808.97 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.27,103.16 కోట్ల వృద్ధితో రూ.4,16,625.19 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,851.9 కోట్లు పెంచుకుని రూ.4,44,363.28 కోట్ల వద్ద స్థిర పడింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.26,672.18 కోట్లు పెరిగి రూ.4,48,810.74 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ ఎం-క్యాప్ రూ. 25,975.05 కోట్ల లబ్ధితో రూ.5,11,777.01 కోట్ల వద్ద ముగిసింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,088.37 కోట్లు పెరిగి రూ.13,89,678.12 కోట్లకు దూసుకెళ్లింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.15,930.43 కోట్లు పెరిగి రూ.4,53,548.76 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.10,916.49 కోట్లు పెంచుకుని రూ.8,00,268.93 కోట్ల వద్ద స్థిర పడింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత మార్కెట్ లీడర్‌గా రిలయన్స్.. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.