హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): సరికొత్త డిజైన్లతో విలాసవంతమైన నివాసాలు, ఆహ్లాదకరమైన గృహ సముదాయానికి పెట్టింది పేరుగా సాన్వీ ఇన్ఫ్రా వారి ‘కౌసల్య మణిద్వీపం’ ప్రాజెక్టు నిలుస్తున్నది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి ఇదో సువర్ణావకాశం. గృహసముదాయాలను అన్నిటికంటే భిన్నం గా బాచుపల్లిలో నిజాంపేట రోడ్డులో నిర్మిస్తున్నది. ఇందులో రెసిడెన్షియల్ కమ్యూనిటీ కోసం 3 (ఏ, బీ, సీ) బ్లాక్‌లను విశాలమైన స్థలంలో ఎంతో సౌకర్యవంతంగా నిర్మిస్తున్నా రు. విభిన్నమైన డిజైన్లతోపాటు విశాలమైన వెంటిలేషన్ కలిగి ఉండేలా ప్రణాళికలు వేశా రు. గృహసముదాయానికి ఇది పరిపూర్ణమైన నివాసయోగ్యంగా తీర్చిదిద్దారు. బాచుపల్లి ఎక్స్‌రోడ్డులో ప్రముఖ విద్యాసంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలకు చేరువలో నేషనల్ హైవే-44కు నిమిషాల్లో చేరుకునేలా ఆహ్లాదకరమై గృహసముదాయాన్ని సొంతం చేసుకోవచ్చు.
ప్రతి నిర్మాణంలో వాస్తుశాస్త్రం…
ప్రతి నిర్మాణం వాస్తుశాస్త్రం ప్రకారం కొనసాగింది. 3బీహెచ్‌కే 1832 స్కేర్ ఫీట్లు, 2బీహెచ్కేతోపాటు అన్ని నిర్మాణ ప్రదేశాల్లో వాస్తుశాస్త్ర సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నతమైన ప్రణాళికతో పనులు చేస్తున్నారు. ఇది అద్భుతమైన జీవన ప్రమాణాలను పెంపొందించేదిగా ఉంటుంది. ఒక్కో ఫ్లాట్ ఏరియా 1184 స్కేర్ ఫీట్లుగా ఉంటుంది. ఇక్కడి నిర్మాణాలు అన్నీ హెచ్ఎండీఏ అనుమతులు, ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి.
సదుపాయాలు భళా…
ప్రవేశ సింహద్వారం, సీసీటీవీ, 24X7 (24 గంటలు) సెక్యూరిటీ, చిల్డ్రన్ ప్లే ఏరియా, బేబీ కేర్ సెంటర్ రూం, యోగా మెడిటేషన్ రూం, స్కైవ్యూ స్విమ్మింగ్ పూల్, డాక్టర్ కన్సల్టెంట్ రూం, ఎల్డర్స్ సిట్టింగ్ ఏరియా, కాంపౌండ్ వాల్‌కు సోలార్ ఫెన్సింగ్, లైబ్రరీ రూం, విశాలమైన డ్రైవ్ వే, క్రికెట్ పిచ్, పార్టీ లాన్, కంట్రీయార్డ్ లాండ్స్కేప్, ఔట్‌డోర్ ఫిట్నెస్ జిమ్, ఔట్‌డోర్ గార్డెన్, సీటెడ్ గ్యాలరీ, బ్యాడ్మింటన్ కోర్టు, షటిల్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, మల్టీపర్పస్ కోర్టు, జాగింగ్ ట్రాక్.
ప్రముఖ ప్రదేశాలతో అనుసంధానం…
ప్రముఖ ప్రదేశాలతో అనుసంధానం కావడానికి సులవుగా ఉంటుంది. బాచుపల్లి, ఎడ్యుకేషన్ హబ్, ఐటీహబ్లాంటి అనేక సంస్థలకు ఈజీగా చేరుకోవచ్చు. హాస్పిటల్స్, విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఎంటర్టైన్మెంట్, ట్రాన్స్‌పోర్టేషన్ సమీపంలోనే ఉండటం విశేషం.