హైదరాబాద్, ఏప్రిల్ 15: అమెరికాకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సేవల సంస్థ ఎల్పీఎల్ ఫైనాన్షియల్..హైదరాబాద్ తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది.
అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా ఈ నూతన జీసీసీని నెలకొల్పినట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్ కాజా తెలిపారు. హైదరాబాద్లో అధునాతన మౌలిక సదుపాయాలతోపాటు ఆర్థిక సేవలు, టెక్నాలజీ, ఏఐ, ఆటోమేషన్, క్లౌడ్ ఇంజినీరింగ్లో ప్రతిభ కలిగిన టెక్నాలజీ నిపుణులు ఉండటం వల్లనే ఇక్కడ సెంటర్ను నెలకొల్పినట్టు చెప్పారు.