అంబర్పేట, నవంబర్ 20: జాతీయ లాజిస్టిక్స్ విధానంతోపాటు ప్రధానమంత్రి గతిశక్తి, మల్టీమాడల్ మౌలిక సదుపాయాలు కల్పించడంతో గడిచిన పదేండ్లలో దేశీయ లాజిస్టిక్స్ రంగం అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని కేంద్ర మంత్రి జయంతి చౌదరి తెలిపారు. హైదరాబాద్లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ లాజిస్టిక్స్ ట్రైనింగ్ ఎక్సలెన్స్ను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..లాజిస్టిక్స్ రంగంలో నైపుణ్యాలను పెంపొందించడంలో భాగంగా ఒక ముందడుగు పడిందన్నారు.
రెడింగ్టన్ లిమిటెడ్ సీఎస్ఆర్ విభాగం, రెడింగ్టన్ ఫౌండేషన్, లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని స్థాపించింది. ఈ ఎక్సలెన్స్సెంటర్లోట్రక్ డ్రైవింగ్, గిడ్డంగి కార్యకలాపాలు, ఫోర్క్లిఫ్ట్ నిర్వహణ, వేర్హౌస్ సఫ్లై చైన్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాల్లో నైపుణ్యం పెంపొందిండచానికి కృషి చేయనున్నదన్నారు. ఈ సెంటర్లో అధునాతన సిమ్యులేషన్ ల్యాబ్లు, టెక్నాలజీ ఆధారిత శిక్షణను ఇస్తుందని చెప్పారు. తెలంగాణలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటున్నదన్నారు.