నందిగామ, నవంబర్ 8: ఫిన్లాండ్ సంస్థ లిండ్స్ట్రోమ్కు సబ్సిడరీ అయిన లిండ్‌స్ట్రోమ్ ఇండియా బుధవారం అత్యాధునిక వర్క్‌వేర్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఈ కంపెనీకి ఇది హైదరాబాద్‌లో రెండవ ఫెసిలిటీ. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలకు వర్క్‌వేర్, క్లీన్‌రూమ్ వర్క్‌వేర్ సర్వీసుల్ని ఈ కంపెనీ అందిస్తుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ శివారు 3 ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ సదుపాయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ముఖ్యఅతిథిగా హాజరై ఫిన్లాండ్ రాయబారి కిమ్మో లహ్ధేవిర్తాతో కలిసి ప్రారంభించారు. తాజా ఫెసిలిటీతో లిండ్స్ట్రోమ్కు దేశవ్యాప్తంగా 11 వర్క్‌వేర్, 2 క్లీన్‌రూమ్ యూనిట్లు ఉన్నాయి.
యూనిట్ ప్రారంభ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం, సౌకర్యాలు ఉన్నాయన్నారు. రాష్ట్రం లో పరిశ్రమల ఏర్పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నదని, టీఎస్ ఐ పాస్‌తో పాటు పరిశ్రమలకు 24 గంటల కరెంట్, రవాణా వ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని, తద్వారా రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలలో అన్ని రంగాలలో పెట్టుబడులు భారీగా పెరిగాయని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు ఇస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లిండ్‌స్ట్రోమ్ సీఈఓ జుహా లారియో, ప్రతినిధులు చక్రబర్తి, జయంత్రాయ్ తదితరులు ఉన్నారు.