న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థ మంగళవారం ఓ సరికొత్త ప్లాన్ను పరిచయం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు చేతులమీదుగా దీన్ని ఆవిష్కరించింది. ఇక ఇదో నాన్-లింక్డ్, వ్యక్తిగత/బృంద, పొదుపు, తక్షణ యాన్యుటీ ప్లాన్. సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ రకాల కోసం విస్తృత శ్రేణిలో యాన్యుటీ ఆప్షన్లను అందిస్తుంది. జీవించి ఉన్న పాలసీదారులకైనా, మరణించిన పాలసీదారుల నామినీలు, వారసులకైనా ప్లాన్ నిబంధనలకు లోబడి ఎంచుకున్నవిధంగా ఒకేసారి లేదా వాయిదా పద్ధతుల్లో చెల్లింపులుంటాయి. ఈ కార్యక్రమంలో ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ కుమార్ గోయల్లతోపాటు ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతీ ఇతర మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ప్రత్యేకతలు