న్యూఢిల్లీ, జూలై 24:ఎల్ఐసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐడీబీఐ బ్యాంక్ జూన్ త్రైమాసికానికిగాను రూ.1,224 కోట్ల లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.756 కోట్ల లాభంతో పోలిస్తే 62 శాతం ఎగబాకినట్లు వెల్లడించింది. బ్యాంక్ ఆదాయం రూ.5,774 కోట్ల నుంచి రూ.7,712 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.4,634 కోట్ల నుంచి రూ.6,860 కోట్లకు పెరిగింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 19.90 శాతం నుంచి 5.05 శాతానికి తగ్గగా..నికర ఎన్పీఏ 1.26 శాతం నుంచి 0.44 శాతానికి దిగొచ్చాయి.