LIC IPO | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎల్ఐసీ ఐపీవోపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. మార్కెట్లో ఒడిదొడుకులను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు దీపం కార్యదర్శి తుహిన్ కాంతా పాండే చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లాలని కేంద్రం ఆసక్తితో ఉన్నదన్నారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.78 వేల కోట్ల నిధులు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకోసం ఎల్ఐసీ ఐపీవో ద్వారా రూ.60 వేల కోట్ల పై చిలుకు నిధులు సమకూర్చుకోవాలని భావిస్తున్నది. ఈ నెలాఖరుతో
అయినా ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లే అంశంపై పునరాలోచిస్తామన్నారు తుహిన్ కాంతా పాండే. ప్రస్తుతానికి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఐపీవో, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను బట్టి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఎకనమిక్స్ ఆఫ్ కాంపిటీషన్ లా-2022 ఏడో జాతీయ సదస్సులో పాండే చెప్పారు. నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.