LIC IPO | ఆదివారం కూడా ఎస్బీఐ శాఖలన్నీ పని చేస్తాయి.. ఎందుకంటే?!
LIC IPO | ఎల్ఐసీ ఐపీవో దరఖాస్తులు స్వీకరించేందుకు ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఎస్బీఐ శాఖలు ఆదివారం పని చేస్తాయి.
LIC IPO | ఆదివారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీఐ) శాఖలన్నీ తెరిచి ఉంటాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రస్తుతం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఐపీవో కోసం ఇన్వెస్టర్లు బిడ్లు దాఖలు చేయొచ్చు. ఈ నెల 8న ఆదివారం ఎల్ఐసీ ఐపీవో అప్లికేషన్లను ఆమోదించేందుకు అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ఎఎస్‌బీఏ) డిజిగ్నేటెడ్ బ్యాంక్ శాఖలన్నీ తెరిచి ఉంచాలని గురువారం ఆర్బీఐ ఆదేశించింది.
ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనే ఖాతాదారులకు గుడ్ న్యూస్ అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎల్ఐసీ ఐపీవో కోసం బిడ్ డాఖలు చేసే వారి సౌకర్యార్థం ఆదివారం (మే 8) మా అన్ని శాఖలు తెరిచి ఉంటాయి అని పేర్కొంది. ఈనెల నాలుగో తేదీన ప్రారంభమైన ఎల్ఐసీ ఐపీవోకు అన్ని వర్గాలనుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. గురువారం పూర్తిస్థాయిలో సబ్‌స్క్రైబ్ అయ్యింది.
ఎల్ఐసీ ఐపీవోలో 1.29 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. 20.85 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎల్ఐసీ ఐపీవోలో 16.2 కోట్ల ఈక్విటీ షేర్లకు మాత్రమే బిడ్లను ఆహ్వానించింది. పాలసీదారులు మినహా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి 3.77 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్లు 1.15 రెట్లు, ఉద్యోగులు 2.89 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- All Branches
- LIC IPO
- RBI Orders
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

