Home Loans Costly | భారీగా వడ్డీ పెంచేసిన ఎల్ఐసీ.. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
Home Loans Costly | ఇండ్ల రుణాలపై ఎల్ఐసీ హౌసింగ్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు 50 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచేశాయి.
Home Loans Costly | ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పయనిస్తున్నాయి. ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు 50 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. గత మే నుంచి ఆర్బీఐ 140 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచినప్పటి నుంచి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) వడ్డీరేట్లు సవరిస్తున్నాయి.
దీనికి అనుగుణంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సోమవారం ఇండ్ల రుణాలపై 50 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు పెంచింది. దీంతో వేతన జీవులు, వృతి నిపుణుల ఇండ్ల రుణాలపై కనిష్టంగా వడ్డీ 7.70 శాతం వసూలు చేస్తామని తెలిపింది. తాజా వడ్డీరేట్ల పెంపు తర్వాత కూడా పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల వడ్డీతో పోలిస్తే తక్కువేనని పేర్కొంది.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తన ప్రైమ్ లెండింగ్ రేట్ (ఎల్హెచ్పీఎల్ఆర్) 50 బేసిక్ పాయింట్లు పెంచేసింది. దీంతో ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 7.50 శాతం నుంచి ఎనిమిది శాతానికి పెరిగింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ వై విశ్వనాథ గౌడ్ మాట్లాడుతూ 0.5 శాతం రెపోరేట్ పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల నెలవారీ రుణ వాయిదాలు, హోంలోన్ టెన్యూర్లపై కనీస ప్రభావమే చూపుతుందన్నారు. సొంతిండ్ల కొనుగోలు దారుల నుంచి గిరాకీ యథాతథంగా కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
గతవారం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 20 బేసిక్ పాయింట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా నెలవారీ ఈఎంఐలు భారం కానున్నాయి. రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) కూడా ఎస్బీఐ పెంచేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కూడా రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

